ఏపీలో మరో 1446 మద్యం షాపుల తొలిగింపు

ఎపిలో పదమూడు శాతం మద్యం షాపులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషంగా ఉంది. మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.తొలుత ఇరవై శాతం శాతం షాపులు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం మరో పదమూడు శాతం షాపులను తగ్గించింది.

దీంతో మొత్తం 33 శాతం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లయింది. 4380 మద్యం షాపులను 2934కి తగ్గించింది. ఈ నెలాఖరు నాటికి షాపులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 43వేల బెల్టు షాపులను తొలగించడంతో పాటు, 40 శాతం బార్లును గతంలోనే తగ్గించింది.

ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో నూటికి నూరుశాతం మద్యం దుకాణాలు ఎత్తివేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.