ఆంధ్రప్రదేశ్ లో 1000 దాటినా కరోనా కేసులు

గత 24 గంటల్లో 61 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపి వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. మృతుల సంఖ్య సంఖ్య 31కి చేరింది. ఇంతవరకు శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదు. కాని ఇప్పుడు ఒకేసారి 3 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు 177 మంది కోలుకున్నారు. కర్నూలులో అత్యధికంగా 275, గుంటూరులో 209 కరోనా కేసులు నమోదయ్యాయి.