పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ప్రారంభం

ఇదివరకు ప్రకటించినట్లుగానే విద్యాదీవెన పధకాన్ని ప్రారంభించారు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ పధకం కింద 12 లక్షల మంది విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కింద ఆర్దిక సాయం అందించారు. విద్యార్దుల తల్లుల ఖాతాలలోకి ఈ డబ్బు జమ అయింది.

గతంలో ఎన్నడూ లేని విదంగా మార్చి 31 నాటికి బకాయిలు అన్నిచెల్లించే విదంగా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. కాలేజీలలో సదుపాయాలు సరిగా లేకపోతే పిల్లల తల్లులు కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించవచ్చని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ విద్యార్దుల తల్లులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ స్కీము కింద నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇంత సంక్షోభ పరిస్థితిలో కూడా ఈ స్కీముకు నిదులు విడుదల చేశారు.