ఈ నెల కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వరుసగా రెండో నెల కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ స్థాయిల్లో జీతాల్లో కోతలు పెడుతున్నట్లు ప్రకటించింది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. రిటైర్డ్‌ ఉద్యోగులకు పూర్తి పింఛన్లు(గత నెలలో 50 శాతం) అందిస్తామని పేర్కొంది.

సచివాలయ ఉద్యోగులకూ పూర్తి వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. లాక్‌డౌన్‌తో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోవడం, కరోనాపై పోరుకు ప్రభుత్వంమే ఖర్చు చేస్తుండంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించింది.