తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదు

శ్రీకాకుళం జిల్లాలో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కరోనా అనుమానిత లక్షణాలున్న పాతపట్నం యువకుడికి జరిపిన పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినా, అతని కుటుంబ సభ్యులు ముగ్గురికి పాజిటివ్‌ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

అనుమానిత వ్యక్తులతో కలిసి తిరిగిన గ్రామానికి చెందిన 22 మందిని ముందస్తు జాగ్రత్తగా ఎచ్చెర్ల క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు.