ఏప్రిల్ 20 నుండి లాక్ డౌన్ నుంచి మినహాయింపు వున్నవి, లేనివి

ఈనెల 20 నుండి గ్రీన్‌ జోన్ల పరిధిలో కర్ఫ్యూను సడలించేందుకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పావులు కదుపుతున్నాయి. ఈమేరకు బుధవారం కొన్ని నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మరీ ముఖ్యంగా వ్యవసాయ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించేలా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 హాట్‌స్పాట్‌ కేంద్రాలు, నాన్‌ హాట్‌స్పాట్‌ కేంద్రాలు, గ్రీన్‌జోన్లుగా గుర్తించారు.

ఈ గ్రీన్‌ జోన్ల మరియు నాన్‌ హాట్‌స్పాట్‌ కేంద్రాలు పరిధిలో ఏప్రిల్‌ 20 నుండి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయ విక్రయాలకు, మార్కెట్లకు అనుమతించనున్నారు. వ్యవసాయ పనిముట్లు అందించే కంపెనీలు, షాపులను కూడా అనుమతిస్తారు.విత్తనోత్సత్తి సహా ఎరువులు, పురుగుమందుల దుకాణాలను తెరచుకునే అవకాశం కల్పిస్తారు. అలాగే అంత్యక్రియలు, పెళ్లిళ్లు వంటి వాటికి 20 మందికి మించి అనుమతి లేకుండా చర్యలు తీసుకోనున్నారు.

మినహాయించబడినవి:
మందుల షాపులు, పాలు, నిత్యావసరాలు, పౌల్ట్రి పరిశ్రమలు, టీ, కాఫీ, రబ్బరు సాగు,ఆక్వా రంగం, గృహావసరాలైన ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్‌ మెకానిక్‌లు, కార్పెంటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతిస్తారు.

నిషేధించబడినవి:
సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, పబ్‌లు, స్టోర్స్‌, కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, విద్యాసంస్థలు, శిక్షణా సంస్తలు, మత ప్రార్ధనా ప్రాంతాలు పూర్తిగా నిషేధించనున్నారు.