ఇటలీ నుండి వైజాగ్ చేరుకున్న ఎపి విద్యార్థులు

ఐదుగురు బాలికలతో సహా 28 విద్యార్థుల ఇటలీ లోని మిలన్ మరియు దాని పరిసర ప్రాంతాలలో వేర్వేరు కోర్సులను అభ్యసిస్తున్నారు. వారు ఇటలీ నుంచి మార్చి 21 తేదీన ఢిల్లీ వచ్చి ప్రభుత్వ ఐటీబీపీ క్యాంపస్‌లోని క్వారంటైన్‌ కేంద్రాల్లో ఏపీ విద్యార్థులు 33 మంది ఉన్నారు. వీరికి రెండు సార్లు కోవిడ్‌ పరీక్షలు జరపగా నెగిటివ్‌గా తేలింది. క్వారంటైన్‌ పూర్తయ్యాక ఐటీబీపీ క్యాంపస్‌ అధికారుల అనుమతి తీసుకుని ప్రైవేటు బస్సులో ఏప్రిల్‌ 10న బయలుదేరారు.

ఏపీ ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో ఆ 33 విద్యార్థులు చివరకు ఏప్రిల్ 13 న ఇళ్లకు చేరుకున్నారు. వీరిలో విశాఖపట్నం మరియు విజయనగరంతో సహా ఉత్తర ఆంధ్ర జిల్లాల నుండి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు.