ఏపీ ఐసెట్2019 ఫలితాలు విడుదల

ఏపీ ఐసెట్2019 ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏపీఐసెట్ 2019 టెస్ట్‌ను నిర్వహించింది. ఏపీ ఐసెట్‌ 2019 ఫలితాలను బుధవారం విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు, వెంకటేశ్వర వర్సిటీ వీసీ విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు52,736 మంది దరఖాస్తు చేసుకోగా, 48,445మంది విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాది కంటే ఐదువేల మంది అధికంగా దరఖాస్తు చేసుకోగా, కంప్యూటర్ బేసిడ్ కామన్ ఎంట్రన్స్ మొదటిగా ఏపీలో ప్రారంభించామని విజయరాజు అన్నారు.

జులై మూడోవారం నుంచి కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గుంటూరు జిల్లాకు చెందిన కారుమూరి నాగసుమంత్ తొలిర్యాంకు సాధించారు. తూర్పు గోదావరికి చెందిన కంటె కావ్యాశ్రీ రెండు, విజయవాడకి చెందిన నరహరిశెట్టి శివసాయి పవన్ మూడో ర్యాంకు సాధించారు.