బీబీకి, తన ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ఆశ్ర‌యం ఇచ్చిన‌ కెన‌డా

మహ్మద్‌ ప్రవక్తను దూషించినందుకు 2009లో పాకిస్థాన్‌లో క్రైస్తవ మహిళ ఆసియా బీబీకి ఓ ట్రయల్‌ కోర్టు 2010 నవంబర్‌లో ఆమెకు మరణశిక్షను విధించింది. అయితే ఇటీవల ఆమెకు మరణశిక్ష నుండి విముక్తి పొందిన విషయం తెలిసిందే.

కాగ ఆసియా బీబీ ఇప్పుడు కెన‌డాకు వెళ్లిన‌ట్లు ఆమె త‌ర‌పున లాయ‌ర్ తెలిపాడు.ఈ కేసులో ఆసియా 8 ఏళ్ల జైలు శిక్ష‌ను అనుభ‌వించింది. ఆసియా బీబీకి చెందిన ఇద్ద‌రు పిల్ల‌ల‌కు కూడా కెన‌డా ఆశ్ర‌యం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. పాక్ ప్ర‌భుత్వం మాత్రం దీనిపై ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.