ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిస‌న్‌పై గుడ్డుతో దాడి

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిస‌న్‌పై ఓ యువతి గుడ్డుతో దాడి చేసింది. మే 18న ఆస్ట్రేలియాలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కెన‌బెరా స‌మీపంలోని అల్బురీలో స్కాట్ మారిస‌న్‌ ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించారు.

కంట్రీ వుమెన్స్‌ అసోసియేషన్‌ నేతలతో చర్చిస్తున్న సమయంలో ఓ యువతి వెనుక నుంచి వచ్చి ప్రధాని త‌ల‌పై గుడ్డును విసిరింది. అయితే ఆ గుడ్డు ప‌గ‌ల‌లేదు. ఈ ఘ‌ట‌న‌లో సదరు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఒక పిరికిపంద చర్య అని స్కాట్ మారిస‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ ఘటనలో స్వల్పతోపులాట జరగడంతో ఓ వృద్ధురాలు కిందపడిపోయారు. దీంతో పక్కనే ఉన్న స్కాట్ మారిస‌న్ ఆమె దగ్గరికి వచ్చి పైకి లేవడానికి సహాయం చేశారు. ఆస్ట్రేలియాలో ఇటీవ‌ల ప‌లువురు నేత‌ల‌పైన కూడా గుడ్ల దాడి జ‌రిగింది.