యాక్సిస్‌ బ్యాంకు యొక్క రూ.25 లక్షల నగదు స్వాధీనం

వాహనాలు తనిఖీలు చేస్తుండగా పోలీసులు రూ.25 లక్షల నగదును గుర్తించారు. యాక్సిస్‌ బ్యాంకు సిబ్బంది తరలిస్తుండగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు నగరం నుంచి పొదలకూరుకు యాక్సిస్‌ బ్యాంకు సిబ్బంది రూ.25 లక్షల నగదును తరలిస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా నగదును గుర్తించారు. అయితే సిబ్బంది సరైన పత్రాలు చూపించకపోవడంతో ఎన్నికల అధికారికి ఈ నగదును అప్పగించారు. బ్యాంకు సిబ్బంది పూర్తిస్థాయిలో పత్రాలు చూపిస్తేనే ఎన్నికల అధికారులు బ్యాంకుకు అప్పగిస్తారని నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ తెలిపారు.