న్యూజీలాండ్ కాల్పుల దాడి లో బాంగ్లాదేశ్ క్రికెటర్లు సురక్షితం

న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్‌ టీమ్‌పై ఓ అగంతకుడు గన్‌తో దాడి చేయబోయాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌ స్టేడియానికి సమీపంలో ఉన్న మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు బంగ్లాదేశ్ క్రికెటర్లు వెళ్లారు. అక్కడ ప్రార్థనలు జరుగుతుండగా.. గన్‌తో ప్రవేశించిన ఓ అగంతకుడు కాల్పులు జరిపాడు. అయితే.. ఈ దాడి నుంచి బంగ్లాదేశ్‌ క్రికెటర్లు సురక్షితంగా బయటపడినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు ప్రకటించాయి.