కొత్త జెర్సీతో ప్రపంచకప్‌ ఆడబోతున్న బంగ్లాదేశ్‌

మే 30 నుండి ఇంగ్లాండ్‌ మరియు వేల్స్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ 2019 సమరం మొదలుకానుంది. ఇందుకోసం అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులు 15 మంది సభ్యులతో కూడిన జట్లను ప్రకటించాయి. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.

ఐతే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ కొత్త జెర్సీతో బరిలోకి దిగుతుంది. ఈ జెర్సీ ఆకుపచ్చ రంగులో ఉంది. ప్రపంచకప్‌ లోగో కుడివైపున, బిసిబి లోగో ఎడమ వైపున ఉంది. ఈ కొత్త జెర్సీతోనైనా బంగ్లాదేశ్‌ రాత మారుతుందో లేదో చూడాలి. 1990 నుంచి బంగ్లాదేశ్‌ ప్రపంచకప్‌ వేటలో ఉన్నా ఇప్పటివరకు కప్‌ సాధించలేదు. జూన్‌2న దక్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.