చంద్రబాబు నాయుడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఏపి సియం చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోది, ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. ప్రతిపక్షనేత జగన్‌ కూడా సియంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి.

పుట్టిన రోజును పురస్కరించుకుని సియం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు. తిరుపతిలోని కోటకొమ్మలవీధిలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమంలో భువనేశ్వరి, లోకేష్‌, బ్రాహ్మణి తదితరులు పాల్గొంటారు.