కుక్క నోట్లో పేలిన నాటుబాంబు

జిల్లాలోని ఉదయగిరిలో ఈరోజు ఓ కుక్క నోట్లో నాటు బాంబు పెట్టుకుని కొరకడంతో బాంబు నోట్లో పెట్టుకుని కొరకడంతో కుక్క తల పేలిపోయింది. ఈ పేలుడు గాను స్థానికులు భయంతో పరుగులు తీశారు.

అయితే ఈ బాంబు అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన నాటు బాంబులుగా స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాంబు ఎక్కడి నుంచి వచ్చింది, అడవి పందుల కోసం ఏర్పాటు చేసారా… లేక ఇళ్లల్లో ఎక్కడన్నా బాంబులు స్టాక్ ఉన్నాయా అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు.