హైదరాబాద్ లో బాంబు పేలుడు

నగరంలో జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐరన్‌ తయారు చేసే కంపెనీలో ఒక్కసారిగా బాయిలర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. జీడిమెట్లలోని జైరాజ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఐరన్‌ రాడ్స్‌ తయారు అవుతాయి. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అందులో ఉన్నవారందరూ ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయితే చుట్టుపక్కల ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చాలా మంది మంటల్లోనే చిక్కుకున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు.