25 బంతుల్లోనే 100

ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ విల్‌ జాక్స్‌ (105; 30 బంతుల్లో 8×4, 11×6) అరుదైన ఘనత సాధించాడు. దుబాయ్‌లో జరుగుతున్న టీ10 టోర్నీలో సర్రే తరఫున ఆడుతూ లాంక్‌షైర్‌పై ఈ టీనేజర్‌ 25 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ స్టీఫెన్‌ పెర్రీ వేసిన ఓవర్లో జాక్స్‌ ఆరు సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో క్రిస్‌ గేల్‌ వేగవంతమైన సెంచరీ రికార్డు (30 బంతుల్లో, 2013 ఐపీఎల్‌)ను జాక్స్‌ దాటాడు. కానీ ఇది అధికారిక మ్యాచ్‌ కాకపోవడంతో ఈ రికార్డు పరిగణనలోకి తీసుకోరు. విల్‌ సెంచరీతో సర్రే 3 వికెట్లకు 176 పరుగులు చేయగా.. లాంక్‌షైర్‌ 81/9కే పరిమితమైంది.