దిశా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన సీఎం జగన్

మహిళల రక్షణ దిశగా ఏపీ సర్కారు మరో అడుగు ముందుకేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను ఇవాళ సీఎం జగన్‌ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు అర్బన్ జిల్లాలతో కలిపి మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. వీటన్నింటినీ జగన్ రిమోట్ ద్వారా ప్రారంభించారు. అదేవిధంగా దిశ కేసులనుయ వేగవంతంగా దర్యాప్తుకు అవసరమైన యంత్రాంగం ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సహా డీజీపీ గౌతం సవాంగ్‌, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా పాల్గొన్నారు.