లోక్‌సభ తుది జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదించిన జాబితాను గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌వాస్నిక్‌ విడుదల చేశారు.

విజయవాడ లోక్‌సభ స్థానానికి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, విశాఖపట్నం నుంచి పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, నంద్యాల నుంచి జె.లక్ష్మీనారాయణ యాదవ్‌ పేర్లు ఖరారయ్యాయి. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తొలి జాబితాలో 132 స్థానాలకు ఖరారు చేయగా మిగిలిన స్థానాల అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేశారు.