డిగ్రీ పరీక్షలు వాయిదా

ఎన్నికల నేపథ్యంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ పరిథిలో శుక్ర, శనివారాల్లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వీఎస్‌యూ పరీక్షల నియంత్రణా అధికారి సాయి ప్రసాద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 25వ తేదీ నుంచి పరీక్షలు యథావిథిగా జరుగుతాయన్నారు. వాయిదా పడిన పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలో ప్రకటిస్తామన్నారు.