ఎర్రచందనం స్మగులర్లను పట్టుకున్న పోలీసులు

తిరుపతి అలిపిరి రోడ్డు ఎన్ సి సి ఫైర్ రేంజి సమీపంలో 70 ఎర్ర చందనం దుంగలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరవింద్ ఐ ఆసుపత్రి వద్ద ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే వీరి రాకను గమనించిన దుండగులు.. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ళదాడి చేశారు. తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు వాడిన వాహనాలు ధ్వంసం అయ్యాయి