చిరుత పులి పిల్లతో ఫేస్ తో ఫేస్

కొన్ని రోజుల క్రితం టూరిస్టులతో కలిసి సఫారీకి వెళ్లిన డిల్లాన్‌ నెల్సన్‌(25) నేచర్‌ గైడ్‌కు ఓ చిరుత కనిపించింది. దానికి పది నెలల వయస్సు గల రెండు పిల్లలు ఉన్నాయి. వాటిని చూసి ముచ్చటపడ్డ నెల్సన్‌ ఫొటో తీసేందుకు ప్రయత్నించగా.. ఓ చిరుత పిల్ల అతడిని విచ్చేసింది. గడ్డి పరకలు నములుతూ.. కొద్దిసేపు అతడిని షూను వాసన చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం గురించి నెల్సన్‌ మాట్లాడుతూ.. చిరుత పిల్ల దగ్గరికి రాగానే తనకు భయం వేసిందన్నాడు. అయితే ఈ అనుభవం తనకు కొత్తగా ఉందని.. బహుశా అది తన షూను విచిత్ర వస్తువులా భావించి పరీక్షించేందుకు వచ్చినట్లుందని సరదాగా తెలిపాడు. అందుకే దానిని నిరాశపరచడం ఇష్టంలేక అక్కడే ఉన్నానని చెప్పుకొచ్చాడు.