ప్రపంచాన్ని తమవైపు చూసేలా చేస్తున్న బాలపర్యావరణ వేత్తలు

మణిపూర్‌కు చెందిన ఎనిమిదేళ్ల లిసిప్రియా కంగుజమ్‌ వాతావరణంలో వస్తున్న మార్పులపై చర్యలు తీసుకోండి అంటూ ప్రపంచ అధినేతలను కోరుతోంది. స్పెయిన్‌ వేదికగా ఈనెల 13 వరకు జరుగుతున్న సీఓపీ25 వాతావరణ సదస్సులో భాగంగా ఆమె ప్రసంగించారు. ఆడుకోవాల్సిన వయసులో తమ భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తపరచారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో ‘హౌ డేర్‌ యూ ?’ అంటూ ప్రపంచ నేతలనుద్దేశించి ప్రశ్నించిన స్వీడన్‌ టీనేజర్‌ గ్రెటా థన్‌బర్గ్‌ (16) టైమ్స్‌ మేగజీన్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2019గా నిలిచింది. మానవాళికి ఉన్న ఒకే గృహాన్ని నాశనం చేయవద్దంటూ ఆమె చేసిన పోరాటం మన్ననలు అందుకుందని టైమ్స్‌ మేగజీన్‌ బుధవారం తెలిపింది