పద్మశ్రీ అవార్డును అందుకున్న గౌతమ్ గంభీర్

ఈ సంవత్సరానికి గాను పద్మ అవార్డుల ప్రదోత్సవం రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. వీరికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అవార్డులను ప్రధానం చేశారు. అయితే 2019 పద్మ పురస్కారాలకు మొత్తం 112 మందిని ఎంపిక చేశారు. వీరిలో 47 మందికి ఈనెల 11న అవార్డులను అందజేయగా మిగిలివారికి ఈరోజు అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు.

అవార్డులు అందుకున్న ప్రముఖులు వీరే..

•జానపద గాయని తీజన్‌ బాయి పద్మవిభూషణ్‌
•ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ పద్మభూషణ్‌
•మహాశయ్‌ ధరంపాల్‌ గులాటి పద్మభూషణ్‌
•పర్వతారోహకురాలు బచెంద్రిపాల్‌ పద్మభూషణ్‌
•ప్రముఖ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ పద్మశ్రీ
•.స్వపన్‌ చౌధురి పద్మశ్రీ
• భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునిల్‌ ఛెత్రి పద్మశ్రీ
• ఆర్చర్‌ బంబాయ్‌లా దేవి లైశ్రమ్‌ పద్మశ్రీ
•మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ పద్మశ్రీ
• హెచ్‌ఎస్‌ ఫూల్కా పద్మశ్రీ