టీడిపి అధ్యక్షుడి ఇంటిపై ఆదాయపు పన్ను అధికారుల సోదా

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదా జరిపారు. ద్వారాక నగర్లోని ఇంటితో పాటు హైదరాబాద్ నివాసంలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పది మంది ఐటీ అధికారులతో కూడిన బృందం శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. సకాలంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా లేదా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు.