కరోనా వైరస్ విజృంభణతో దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. దీంతో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దాదాపు ఐదు రోజుల పాటు పూర్తిగా వెల్లడించారు. మొత్తం రూ.20 లక్షల కోట్లను ఏఏ రంగాలకు ఎంత మేరకు కేటాయించారో ఆమె తెలిపారు.
ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆరోగ్యం, విద్య, వ్యాపారాలు, సరళతర వాణిజ్యానికి ఇందులో పెద్ద పీట వేశారు. చివరగా ప్యాకేజీ మొత్తం రూ.20 లక్షల కోట్లను ఏఏ రంగాలకు ఎంత కేటాయించారో వివరించారు నిర్మల. ఆర్బీఐ ఉద్దీపన ప్యాకేజీ కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేశారు.
ఆర్బీఐ ఉద్దీపణ ప్యాకేజ్ – రూ.8.01 లక్షల కోట్లు
మార్చిలో కేంద్రం ప్యాకేజ్ – రూ. 1.92 లక్షల కోట్లు
కరోనా ప్యాకేజ్ 1.0 – రూ. 5.94 లక్షల కోట్లు
కరోనా ప్యాకేజ్ 2.0 – రూ. 3.10 లక్షల కోట్లు
కరోనా ప్యాకేజ్ 3.0 – రూ. 1.50 లక్షల కోట్లు
కరోనా ప్యాకేజ్ 4.0 & 5.0 – రూ. 48,100 కోట్లు
మొత్తం ప్యాకేజ్ – రూ.20 లక్షల కోట్లు
రంగాల వారీగా కేటాయింపులు
1. ఎంఎస్ఎంఈల నిర్వహణ మూలధనం – రూ.3,00,000 కోట్లు
2. రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలు – రూ.20,000 కోట్లు
3. ఎంఎస్ఎంఈల ఫండ్ ఆఫ్ ఫండ్ – రూ.50,000 కోట్లు
4. ఈపీఎఫ్ మద్దతు చర్యలు – రూ.2,800 కోట్లు
5. ఈపీఎఫ్ రేట్ల తగ్గింపు – రూ.6,750 కోట్లు
6. ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీ, ఎంఎఫ్ఐలు – రూ.30,000 కోట్లు
7. ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐలకు పాక్షిక రుణ హమీలు – రూ.45,000 కోట్లు
8. విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆర్థిక సాయం – రూ.90,000 కోట్లు
9. టీడీఎస్, టీసీఎస్ రేట్ల తగ్గింపు – రూ.50,000 కోట్లు
10. వలస కూలీలకు 2 నెలల ఉచిత రేషన్ – రూ.3,500 కోట్లు
11. ముద్రా యోజన శిశు రుణాల వడ్డీ రేట్ల సబ్సిడీ – రూ.1,500 కోట్లు
12. వీధి వ్యాపారులు – రూ.5,000 కోట్లు
13. దిగువ మధ్య తరగతికి చౌక ఇళ్ల పథకం – రూ.70,000 కోట్లు
14. నాబార్డ్ ద్వారా అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ – రూ.30,000 కోట్లు
15. కేసీసీ ద్వారా అదనపు క్రెడిట్ – రూ.2,00,000 కోట్లు
16. మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ – రూ.10,000 కోట్లు
17. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన – రూ.20,000 కోట్లు
18. టాప్ టు టోటల్ (ఆపరేషన్ గ్రీన్స్) – రూ.500 కోట్లు
19. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి – రూ.1,00,000 కోట్లు
20. పశు సంవర్థక మౌలిక వసతుల కల్పన – రూ.15,000 కోట్లు
21. ఔషధ మొక్కల పెంపకం – రూ.4,000 కోట్లు
22. తేనెటీగల పెంపకం – రూ.500 కోట్లు
23. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ – రూ.8,100 కోట్లు
24. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా – రూ.40,000 కోట్లు