కైలాశ్ మాన‌సస‌రోవ‌ర్ మార్గాన్ని లిపులేఖ్ పాస్ తో అనుసంధానించే పనులను పూర్తి

ఉత్త‌రాఖండ్ లో లాక్ డౌన్ కొన‌సాగుతుండంతో బార్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్ (బీఆర్వో) కైలాశ్ మాన‌స స‌రోవ‌ర్ మార్గాన్ని లిపులేఖ్ పాస్ తో అనుసంధానించే పనులను పూర్తి చేసింది.

17,060 మీట‌ర్ల ఎత్తులో ఉత్త‌రాఖండ్ నుంచి లిపులేఖ్ పాస్ కు ఈ మార్గాన్ని అనుసంధానించారు. ఈ మార్గంతో 90కిలో మీట‌ర్ల మేర ప‌ర్వ‌తారోహ‌ణను నివారించ‌డంతోపాటు వాహ‌నాల్లో చైనా స‌రిహ‌ద్దుల వ‌ర‌కు వెళ్లే అవ‌కాశ‌ముంటుంద‌ని బీఆర్వో ఉన్న‌తాధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

ఉత్త‌రాఖండ్ లోని లిపు లేఖ్ పాస్ మీదుగా కైలాశ్ మాన‌స స‌రోవ‌ర్ యాత్ర కొన‌సాగుతుంద‌న్న విష‌యం తెలిసిందే.