ఢిల్లీలో ఇసుక తుపాను, భూకంపం

దేశ రాజధాని నగరం ఢిల్లీని ఇసుక దుమారం కమ్మేసింది. ఇసుక దుమారం కారణంగా నగరంలో పట్టపగలే చిమ్మ చీకట్లు అలుముకున్నాయి.

వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షం కురిసే చూచనలు కనిపిస్తున్నాయి. ఇసుక దుమారంతో రోడ్ల మీద ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఢిల్లీలో భూకంపం

ఢిల్లీలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదైంది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా 01:45 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీలో గత నెల 12, 13 తేదీల్లో భూకంపం వచ్చింది.

నెల వ్యవధిలోనే ఢిల్లీలో వరుస ప్రకంపనలు రావడం ఆందోళన కలిగించే పరిణామమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.