భారత ప్రభుత్వానికి బ్రిక్స్ దేశాలకు చెందిన న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) వంద కోట్ల డాలర్ల (సుమారు రూ.7,500 కోట్లు) రుణం మంజూరు అయింది. కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో దాని వలన కలిగే మానవ, సామాజిక, ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు సాయంలో భాగంగా ఈ రుణం అందిస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది.
బ్యాంకు ఉపాధ్యక్షులు జియాన్జు మాట్లాడుతూ విపత్తు సమయాల్లో సభ్య దేశాలకు మద్దతుగా ఉండేందుకు ఎన్డీబీ ఎల్లవేలలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అత్యవసర అభ్యర్థన మేరకు సత్వర స్పందనలో భాగంగా భారత ప్రభుత్వానికి రుణం మంజూరును ఆమోదించినట్టు తెలిపారు.