ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మ‌న్‌కీ బాత్ ప్రసంగం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మ‌న్‌కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మం‌లో మాట్లాడారు। ఆయన మాట్లాడుతూ, ముఖానికి మాస్క్‌లు ధ‌రించ‌డం మ‌న జీవితాల్లో భాగ‌మైన‌ట్లు తెలిపారు. మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాల‌న్నా, లేక ఇత‌రుల్ని వ్యాధి నుంచి కాపాడాల‌న్నా.. మాస్క్‌లు ధ‌రించ‌డం చాలా ముఖ్య‌మ‌న్నారు. బ‌హిరంగ స్థ‌లాల్లో ఉమ్మివేస్తే క‌లిగే అన‌ర్ధాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెరిగింద‌ని మోదీ అన్నారు.

కోవిడ్‌19 మ‌హమ్మారిని అరిక‌ట్ట‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు చూపిన చొర‌వ‌ను ప్ర‌ధాని మెచ్చుకున్నారు. క‌రోనా సంక్షోభ వేళ రైతులు మాత్రం నిర్విరామంగా ప‌నిచేస్తున్నార‌న్నారు. ఎవ‌రు కూడా ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా ఉండేందుకు రైతులు శ్ర‌మిస్తున్న‌ట్లు చెప్పారు.

డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఎన్‌సీసీ క్యాడెట్లు కూడా దాంట్లో జ‌త‌క‌లిశార‌న్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ప్ర‌తి శాఖ‌, సంస్థ‌లు అన్నీ వీలైనంత త్వ‌ర‌గా కోలుకునేందుకు క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌న్నారు.