దుబాయ్ ఇఫ్తార్‌ విందులో ప్రపంచ రికార్డు సాధించిన భారత్‌ చారిటీ సంస్థ

ముస్లింలకు అత్యంత పవిత్రమాసం రంజాన్‌ అయితే రంజాన్‌ మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాసం తర్వాత ఇచ్చే ఇఫ్తార్‌ విందులో భారత్‌కు చెందిన ఓ చారిటీ సంస్థ గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది.

కాగా అబుదాబిలోని దుబాయ్ పారిశ్రామిక పార్కులో భారతీయులు నడిపిస్తున్న పీసీటీ హ్యుమానిటీ చారిటీ సంస్థ ఏడు రకాల శాఖాహార వంటలతో కిలోమీటర్ పొడవు న ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ఈ ఘనతను సాధించినట్టు గల్ఫ్‌న్యూస్ పేర్కొంది. ఈ రికార్డు సాధించడంలో సాయపడిన అందరికీ కృతజ్ఞతలు అని చారిటీ వ్యవస్థాపకుడు జోగిందర్ సింగ్ సలారియా తెలిపారు.