సియెట్‌ క్రికెట్‌ రేటింగ్‌ అవార్డ్స్‌ ప్రకటన

సోమవారం నాడు సియెట్‌ క్రికెట్‌ రేటింగ్‌ అవార్డ్స్‌ను ప్రకటించారు.

  • కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కింది.
  • మహిళా క్రికెటర్‌ స్మృతి మందాన కూడా ఇంటర్నేషనల్‌ ఉమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకున్నారు.
  • బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ కేటగిరిలోనూ కోహ్లికి అవార్డు దక్కింది.
  • జస్‌ప్రీత్‌ బుమ్రాకు బెస్ట్‌ బౌలర్‌ అవార్డు, ఛతేశ్వర్‌ పుజారాకు ఇంటర్నేషనల్‌ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కింది.

  • అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ అవార్డు రోహిత్‌ శర్మకు దక్కింది.
  • టి 20 ప్లేయర్‌ అవార్డు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఆరన్‌ ఫించ్‌కు దక్కింది.
  • అత్యద్భుత ప్రదర్శన చేసిన క్రికెటర్‌ అవార్డు కుల్దీప్‌ యాదవ్‌ను వరించింది.
  • ఇంటర్నేషనల్‌ టీ20 బౌలర్‌ అవార్డు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్‌ ఖాన్‌కు దక్కింది.
  • మోహిందర్‌ అమర్‌నాథ్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది.