ఇవాళ మూడు జిల్లాలలో ప్రచారం నిర్వహించనున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి

ఎన్నికల ప్రచారంలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి… ఇవాళ మరో మూడు జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

ఈ రోజు శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు జగన్. ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ప్రచారం నిర్వహించనున్న వైసీపీ అధినేత.. ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నంలోని పాడేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు వైఎస్ జగన్.