23 సార్లు ఎవరెస్ట్‌ ఎక్కి రికార్డు సాధించిన కామి రీటా

ఎవరెస్ట్‌ శిఖరాన్ని అత్యధికసార్లు ఎక్కిన పర్వతారోహకుడిగా నేపాల్‌కు చెందిన కామి రీటా రికార్డు సృష్టించాడు. అతను 23 సార్లు ఎవరెస్ట్‌ ఎక్కాడు. అయితే మార్చి నుండి మే నెలలో ఎవరెస్ట్‌ ఎక్కాడనికి ఎక్కువగా పర్వతారోహకులు వస్తుంటారు. అయితే ఈ సారి కామి రీటా టిబెట్‌ నుండి కాకుండా నేపాల్‌ నుండి ఎవరెస్ట్‌ ఎక్కాడు.

హిమాల‌యాల్లో నేపాల్ షెర్పాల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది. షెర్పా తెగ ప్ర‌జ‌లు ప‌ర్వ‌తాల‌ను చాలా ఈజీగా ఎక్కేస్తారు. ఈసారి 8 మంది టీమ్‌తో క‌లిసి షెర్పా కామిరీటా ఎవ‌రెస్టును అధిరోహించాడు. నేపాల్ ప్ర‌భుత్వం ఈసారి మొత్తం 378 మందికి ఎవ‌రెస్టు ఎక్కేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఒక్కొక్క‌రి నుంచి 11వేల డాల‌ర్లు వ‌సూల్ చేస్తోంది.