బాలరత్న అవార్డు సాధించిన కనిశెట్టి అనుదీప్‌

నెల్లూరు జాకీర్‌హుస్సేన్‌ నగర్‌ సత్యనారాయణపురానికి చెందిన కనిశెట్టి అనుదీప్‌ సంగీతంలో రాష్ట్రస్థాయి బాలరత్న అవార్డును సాధించాడు. విజయవాడలోని మాంటిసోరి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలల రంగస్థల ఉత్సవ పోటీలలో పాల్గొన్న అనుదీప్‌ విజేతగా నిలిచి ముఖ్యఅతిథుల చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందుకున్నాడు.

అనుదీప్‌ నెల్లూరులోని ఆర్‌ఎస్‌ఆర్‌ నగరపాలక పాఠశాలలో అడ్వాన్సుడ్‌ ఫౌండేషన్‌ కోర్సులో 6వ తరగతి చదువుతున్నాడు. జిల్లాస్థాయిలో 2018-19కి జవహర్‌ బాలభవన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో విజేతగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్నాడు. తల్లిదండ్రులు విజయ్‌కుమార్, హరితల ప్రోత్సాహంతో పాటు సంగీత గురువులు డీవీ సురేష్‌రావు, చాముండేశ్వరి, మద్దెల లోకేష్‌బాబు, శ్రీదేవిల శిక్షణతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నానని అనుదీప్‌ తెలిపాడు.