భారీగా పడిపోతున్న విద్యుత్‌ డిమాండ్‌

లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకు తగ్గిపోతుంది. మామూలు రోజుల్లో వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా 200 మిలియన్‌ యూనిట్ల (ఎంయు)పైనే అవసరం ఉంటుంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో రోజుకు 25 శాతం వరకు డిమాండ్‌ పడిపోతోంది. డిమాండ్‌ తగ్గుతుండటంతో జెన్‌కో కూడా ఉత్పత్తిని తగ్గిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి అనుమతించిన ధర కంటే యూనిట్‌కు రూ.1.57ల తక్కువ ధరకు ఎక్స్చేంజ్‌లో విద్యుత్‌ లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల మార్చిలో రూ.56కోట్లు ఆదా అయిందని తెలిపారు.