ఆలిండియా ఓపెన్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌ రెండోరౌండ్‌ లో గెలిచిన లక్కీ వత్నాని

ఆలిండియా ఓపెన్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు లక్కీ వత్నాని ముందంజ వేశాడు. క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో లక్కీ వత్నాని రెండోరౌండ్‌లో గెలుపొందాడు. బుధవా రం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండోరౌండ్‌లో లక్కీ వత్నాని (తెలంగాణ) 3–0 (68–17, 87– 63, 79–38) ఫ్రేమ్‌ల తేడాతో సిద్ధేశ్‌పై నెగ్గాడు.