లోక్‌సభ టిక్కెట్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిన మమతా బెనర్జీ

గడచిన కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్‌ తృణమూల్ పార్టీ ఏలుబడిలో నడుస్తోంది. అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికలు ఆ పార్టీకి పరీక్షగా పరిణమించాయి. బీజేపీ నుంచి తృణమూల్‌కు పోటీ ఎదురుకానున్నదని తెలుస్తోంది. దీంతో మమత అప్రమత్తమై పార్టీని మరింత బలోపేతంచేసే పనిలోపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలను సొంతం చేసుకునే దిశగా తన దగ్గరున్న అన్ని రాజకీయ అస్త్రాలను సంధించేందుకు సద్ధమయ్యారు. మమతా బెనర్జీ 34 మంది సిట్టింగ్ ఎంపీలలో 8 మందికి టిక్కెట్ ఇవ్వలేదు.

వీరిలో ఇద్దరు పార్టీని వీడి బీజేపీలో చేరారు. అలాగే మమత లోక్‌సభ టిక్కెట్ల కేటాయింపులో కొత్తవారికి, లోక్‌సభ టిక్కెట్ల కేటాయింపులో ఇచ్చారు. ఈ విధంగా 17 మంది నూతన అభ్యర్థులను ఎంపికచేశారు. ఇక సాధారణ ఎన్నికల విషయానికొస్తే బీజేపీతో తృణమూల్‌కు గట్టిపోటీ ఎదురుకానున్నదని తెలుస్తోంది. పైగా ఇక్కడి లెఫ్ట్‌పార్టీలు కాంగ్రెస్‌తో జతకట్టి బిజేపీ, తృణమూల్‌లను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదిలావుండగా ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన అనంతరం మమత ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని అన్నారు. అలాగే యూపీ నేతలు మాయావతి, అఖిలేష్ ఆహ్వానిస్తే తాను వారణాసిలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తానని పేర్కొన్నారు.