అసెంబ్లీలో పెను దుమారం, చంద్రబాబును అడ్డుకున్న మార్షల్స్

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అసెంబ్లీ వెలుపల అవమానించారు. ఆయనను అసెంబ్లీలోకి రానీయకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అధికార పక్షం అసెంబ్లీలో ప్రదర్శించింది. చంద్రబాబుతో పాటు టీడీపీ సభ్యులను అసెంబ్లీలోకి రానీయకుండా మార్షల్స్ అడ్డుకున్నట్లు ఈ వీడియోద్వారా స్పష్టమైంది. ప్రతిపక్ష నేతను ఎందుకు అనుమతించడం లేదంటూ టీడీపీ సభ్యులు మార్షల్స్‌ను నిలదీశారు. అసెంబ్లీ గేటు వెలుపల కూడా చంద్రబాబుకు ఇదే రకమైన అవమానం జరిగింది. ఆర్టీసీ చార్జీల పెంపుపై నిరసన తెలిపిన అనంతరం రోజూలానే టీడీపీ సభ్యులు అసెంబ్లీలోకి వెళుతుండగా మార్షల్స్ అడ్డుకున్నారు.