3 అరుదైన రికార్డ్స్ సాధించిన ఎంఈఐఎల‌్

ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రా దిగ్గజం ఎంఈఐఎల‌్ గత ఆర్థిక సంవత్సరంలో 130 ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కింది. లిఫ్ట్ ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, గ్యాస్ ప్రాసెసింగ్, గ్యాస్ పంపిణీ తదితర రంగాలలో ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రాజెక్టులను నిర్ణీత గడువు కన్నా ముందే నాణ్యతతో రాజీపడకుండా పూర్తి చేయడం ఎంఈఐఎల‌్ ప్రత్యేకత. రికార్డు సమయంలో400 220 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్‌ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎంఈఐఎల‌్ ఎక్కింది. అలాగే రాగేశ్వరీ వద్ద గ్యాస్ ప్రాసిసింగ్ యూనిట‌్‌ను కూడా కేవలం ఆరునెలల కాలంలోనే నెలకొల్పి రికార్డులను తిరగరాసింది.

2018-19 సంవత్సరానికి గాను తెలంగాణాలో మిషన్‌ భగీరథ కింద కరీంనగర్‌, సిరిసిల్లా, వెములవాడ, చొప్పదండి, పెద్దపల్లి-రమగుండం,మహబూబ్‌నగర్‌, నల్గొండ, పాలేరు-వరంగల్‌ వంటి ప్రాజెక్ట్‌లతో పాటు రాజస్థాన్‌లోని రాగేశ్వరి గ్యాస్‌ టెర్మినల్‌ ప్లాంట్‌, అసింద్‌, కోట్రి, షాపుర, పాలి, ఓడిషాలోనిభూవనేశ్వర్‌ బల్క్‌ వాటర్‌, కియోన్‌జహర్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌, అలాగే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, ఆగ్రా లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇక సాగునీటి రంగంలో పురుషోత్తపట్నం స్టేజ్‌-2, కొండవీటివాగు, చింతలపూడి, హంద్రీ-నీవా ఫేస్‌-2, కర్నాటకలోని ఉత్తర కోలార్‌, దసరహళ్లి, కాన్వా, గుజరాత్‌లోని సౌనీయోజనతో పాటు ఆరు ఎత్తిపోతల పథకాలను దిగ్విజయంగా పూర్తిచేసింది.

అలాగే విద్యుత్ రంగంలో నర్సాపూర్‌, కలికిరి, గజ్వేల్‌, కేతిరెడ్డిపల్లి, మహేశ్వరం, పొదిలి, సత్తేనపల్లి ప్రాజెక్ట్లను పూర్తి చేసింది. ఎంఈఐఎల్‌ పూర్తిచేసిన 130 పైగా ప్రాజెక్ట్‌లో కొన్ని పూర్తిస్థాయిలోని ప్రాజెక్టులుగా కాగా మరికొన్ని ప్రాజెక్ట్‌ల్లో భాగమైన నిర్దేశించిన పనికి సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ప్రతీ ప్యాకేజీని సాంకేతికంగా ఒక ప్రాజెక్ట్‌గానే పరిగణిస్తారు.