నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటా కింద ఎన్నికయ్యే ఆరు శాసనమండలి స్థానాలకు ఉదయం 8గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది.తెలంగాణలో మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ, మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి.. కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఈ పోలింగ్‌ జరగనుంది.