విద్యార్థులతో కలిసి నిరసనకు దిగిన మోహన్ బాబు

సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబు ఈరోజు తిరుపతిలో విద్యార్థులు, తన కుమారులతో కలసి నిరసనకు దిగారు. ఫీజ్‌ రీఇంబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వారు నిరసనకు తెలిపారు.

ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతు నాలుగున్నరేళ్లుగా సిఎం చంద్రబాబు నమ్మించి మోసం చేశారన్నారు. రూ.19 కోట్ల మేర ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వాలని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి తెలిపినా పట్టించుకోలేదని అన్నారు. ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబుకి తానే స్వయంగా ఉత్తరాలు రాసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.