చెన్నై కోయంబేడు మార్కెట్‌లో కరోనా కల్లోలం – నెల్లూరు ప్రజల ఆందోళన

చెన్నై కోయంబేడు మార్కెట్‌కు చెందిన కూలీలలో 50 మందికి పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. అయితే, అక్కడి లింకులు నెల్లూరు జిల్లాలోనూ ఉంటాయేమోనన్న ఆందోళన అందరిలో నెలకొంది. సాధారణంగా కోయంబేడు నుంచి జిల్లాకు అవసరమైన కూరగాయలు చేరవేస్తుంటారు.

ప్రతిరోజూ 8 టన్నుల కూరగాయలు దిగుమతి అవుతుండగా, ఒక్క నెల్లూరు నగరానికే 5 టన్నుల వరకు వస్తుంటాయి. గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట మార్కెట్‌కు మిగిలిన మొత్తం కూరగాయల సరఫరా అవుతోంది. ఇక సరిహద్దు మండలమైన తడకు కూడా ఈ మార్కెట్‌ నుంచి కూరగాయల సరఫరా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కోయంబేడులో కూలీలు కరోనాకు గురికావడంతో జిల్లాలోని కూరగాయల మార్కెట్‌ నిర్వాహకులు, కొనుగోలుదారులలో ఆందోళన రేగుతోంది.