నెల్లూరు జిల్లాలో 100 దాటినా కరోనా పాజిటివ్ కేసులు

నెల్లూరులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 5 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 101కి చేరింది.

అందులో 61 మంది డిశ్చార్జ్ కాగా, ముగ్గురు చనిపోయారు. మిగతా 37 ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.