జగన్ పై విమర్శలు కురిపిస్తున్న నెటిజన్లు

మహిళల రక్షణపై అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్ర సీఎంకి హ్యాట్సాఫ్‌ చెప్పటం కాదని.. మీరు కూడా హ్యాట్సాఫ్‌ చెప్పించుకునేలా పని చేయండని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అంటున్నారు.. కానీ మీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటినా సుగాలి ప్రీతి కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయలేకపోయారని విమర్శిస్తున్నారు. తమ పార్టీ వ్యక్తని గత ప్రభుత్వం కేసుని నీరుగార్చింది, ఇప్పుడు ఒకే సామాజికవర్గమని మీరు నీరుగారుస్తున్నారా అని నెటిజన్లు మండిపడుతున్నారు.