సాంటా క్లాజ్‌ వేషంలో ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సాంటా క్లాజ్‌ వేషంలో వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆశ్యర్యపరిచారు. క్రిస్మస్‌ వేడుక సందర్భంగా వాషింగ్టన్‌లోని హాస్పిటల్‌కు సాంటా తరహాలో ఆయన వెళ్లారు. ఆ హాస్పిటల్‌ సిబ్బందికి ఒబామా శుభాకాంక్షలు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులకు బహుమతలు ఇచ్చారు. అమెరికాకు 44వ అధ్యక్షుడిగా చేసిన ఒబామా వాషింగ్టన్‌లోనే ఉంటున్నారు. గతేడాది కూడా ఇలానే సాంటా వేషంలో వచ్చి స్కూలు పిల్ల్లలను ఆశ్చ్యర్య పరిచారు.