అద్వాణీ ఖాతాలో మరో జాతీయ టైటిల్‌

భారత అగ్రశ్రేణి క్యూయిస్ట్‌ పంకజ్‌ అద్వాణీ ఖాతాలో మరో జాతీయ టైటిల్‌ చేరింది. సీనియర్‌ స్నూకర్‌ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పంకజ్‌ విజేగతా నిలిచాడు. రికార్డు స్థాయిలో తొమ్మిదో స్నూకర్‌ జాతీయ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. మొత్తంగా సీనియర్‌ స్థాయిలో అతడికిది 89వ టైటిల్‌ కావడం విశేషం. ఆదివారం ఫైనల్లో పంకజ్‌ 6-0 (70-36, 91-22, 66-6, 65-51, 77-49, 59-18) తేడాతో లక్ష్మణ్‌ రావత్‌పై ఘన విజయం సాధించాడు. పంకజ్‌ స్నూకర్‌, బిలియర్డ్స్‌లో కలిపి మొత్తం 21 సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. మహిళల్లో వర్ష  టైటిల్‌ నెగ్గింది.