ఆన్‌లైన్‌లో అందుబాటులో ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల టికెట్లు

ఐపిఎల్‌-12 చివరి దశకు చేరుకుంది. చెన్నై, ముంబై, ఢిల్లీ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరుకోగా..మరో బెర్తు కోసం హైదరాబాద్‌, కలకత్తా, పంజాబ్‌ జట్లు పోటీ పడుతున్నాయి. ఐతే హైదరాబాద్‌ జట్టుకే ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మరో నాలుగు రోజుల్లో ప్లేఆఫ్‌ సమరానికి తెరలేవనుంది.

ఈ నెల 8, 10 తేదీల్లో విశాఖలోని ఏసిఏ-విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. 8న ఎలిమినేటర్‌ మ్యాచ్‌, 10న క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌ జరుగుతాయి. ఈ మ్యాచ్‌ల టికెట్లు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నట్లు ఆంధ్ర క్రికెట్‌ సంఘం కార్యదర్శి అరుణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. టికెట్లు www.eventsnow.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.