క్వార్టర్స్‌ కు చేరుకున్న ప్రణయ్

న్యూజిలాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ బిడబ్లూఎఫ్‌ వరల్డ్‌ సూపర్‌-300 టోర్నమెంటులో భారత స్టార్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్స్‌లో ప్రణయ్ 21-14, 21-12తో టామీ సుగియార్తో(ఇండోనేషియా)పై సంచలన విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో సునెయామాతో ప్రణయ్ తలపడనున్నాడు.