నాబార్డ్‌ కొత్త ఏజీఎంగా బాధ్యతలు స్వీకరించిన రవిసింగ్‌

నాబార్డ్‌ కొత్త ఏజీఎంగా రవిసింగ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ముంబయి నుంచి నెల్లూరుకు వచ్చారు.

జిల్లాలో ఏజీఎంగా పనిచేస్తున్న రమేష్‌ విజయవాడ నాబార్డు ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సాయంత్రం కలెక్టర్‌ రేవు ముత్యాలరాజును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరూ జిల్లా పరిస్థితులపై కొద్దిసేపు చర్చించారు.